SBI: ఎస్‌బీఐ ఛైర్మన్‌ పదవీ కాలం పొడిగింపు

ఎస్‌బీఐ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్ల పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది!

Published : 05 Oct 2023 20:17 IST

దిల్లీ: దేశంలో అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) ఛైర్మన్‌ దినేశ్‌ ఖరా(Dinesh khara) పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. వచ్చే ఏడాది ఆగస్టు 28 వరకు ఆయన పదవీ కాలాన్ని పొడిగించేందుకు ఆమోదం తెలిపినట్టు సమాచారం. ఆయన మూడేళ్ల పదవీ కాలం అక్టోబర్‌ 6తో ముగియనున్న నేపథ్యంలో కేబినెట్‌ అపాయింట్స్‌ కమిటీ(ACC) ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే, ఎస్‌బీఐ ఎండీ అశ్వినీ కుమార్‌ తివారీ పదవీ కాలాన్ని సైతం రెండేళ్ల పాటు పొడిగిస్తూ నిర్ణయం కమిటీ నిర్ణయించింది.

దినేశ్‌ ఖరా 2020 అక్టోబరులో మూడేళ్ల కాలానికి ఎస్‌బీఐ ఛైర్మన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఆ పదవిలో ఆయన 63 ఏళ్లు నిండే వరకు కొనసాగే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఆగస్టులో ఆయనకు 63 ఏళ్లు నిండుతాయి. ఈ నేపథ్యంలో మరో ఏడాది పాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఆమోదం తెలపడం గమనార్హం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని