ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్‌ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. వేసవి బొనాంజా ఆఫర్లు

ICICI Bank: ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంక్ ఐసీఐసీఐ (ICICI) తమ కస్టమర్లకు వేసవి బొనాంజా ఆఫర్లు ప్రకటించింది.

Updated : 22 Apr 2023 12:28 IST

 

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంక్ ఐసీఐసీఐ (ICICI).. తమ కస్టమర్లకు శుభవార్త తెలిపింది. వేసవి బొనాంజా ఆఫర్లు (Summer Bonanza offer) తీసుకొచ్చినట్లు  ప్రకటించింది. ఈ ఆఫర్‌తో ఆన్‌లైన్‌ షాపింగ్‌, ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు, ఆభరణాలు, విహారయాత్రల చెల్లింపులు ఇలా.. అన్నింటిలోనూ ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. ఐసీఐసీఐ క్రెడిట్‌కార్డ్‌, డెబిట్‌కార్డ్‌, నెట్‌బ్యాంకింగ్‌, ఈఎంఐల ద్వారా ఈ ఆఫర్‌ వినియోగించుకోవచ్చని తెలిపింది. యాపిల్‌, ఎల్‌జీ, సోనీ వంటి బ్రాండ్‌లకు కూడా ఈ ఆఫర్‌లు వర్తిస్తాయని పేర్కొంది.

ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు

  •  షావోమీ, వీవో, వన్‌ప్లస్‌ కంపెనీ ఉత్పత్తులపై రూ.8 వేల వరకు డిస్కౌంట్‌ ఇస్తోంది.
  •  క్రోమా రిటైల్‌ స్టోర్‌ లేదా వెబ్‌సైట్‌ నుంచి కొనుగోలు చేస్తే రూ.5 వేల వరకు తగ్గింపును ఆఫర్‌ చేస్తోంది.
  •  ఎల్‌జీ, సోనీ, శాంసంగ్‌, డెల్‌, హైయర్‌  వంటి ప్రముఖ బ్రాండ్‌ ఉత్పత్తులపై 22.5 శాతం డిస్కౌంట్‌నిస్తోంది.

ప్రయాణాలు, హోటళ్లు

  •  మేక్‌ మై ట్రిప్‌, ఈసీ మై ట్రిప్‌, యాత్రా వంటి ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్‌ ఫ్లాట్‌ఫాంమ్‌ల నుంచి విమాన ప్రయాణాలకు టికెట్‌ కొనుగోలుకు 15 శాతం డిస్కౌంట్‌ ఇస్తోంది. అదే బస్సు ప్రయాణానికైతే 25 శాతం డిస్కౌంట్‌ను ఇస్తోంది.
  •  ఐసీఐసీఐ కస్టమర్లు ఏ ప్రాంతానికి వెళ్లినా ఎలాంటి హోటల్‌ లేదా విల్లా బుక్‌ చేసుకుంటే దానిపై 25 శాతం వరకు తగ్గింపును ఇస్తోంది.

మరిన్ని ఆఫర్లు.. 

  •  జొమాటో, స్విగ్గీ వంటి ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌ల ద్వారా ఆహారాన్ని బుక్‌ చేసుకుంటే 20 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది.(షరతులు వర్తిస్తాయి)
  •  బహుమతి ఇచ్చే వస్తువులు, మొక్కలు, పువ్వులు వంటి వాటిపై 20 శాతం డిస్కౌంట్‌ను ఇస్తోంది.
  •  ఆన్‌లైన్‌ షాపింగ్‌లోనూ కొన్ని బ్రాండ్లపై పెద్ద ఎత్తున తగ్గింపును అందిస్తోంది.
  •  సాధారణంగా అందం, ఆరోగ్యం కోసమే చాలా మంది ఎక్కువగా డబ్బులు వెచ్చిస్తుంటారు. వాటిపై కూడా ఐసీఐసీఐ బ్యాంక్‌ ఆఫర్లు ప్రకటించింది. ఫార్మ్ ఈజీ, టాటా క్లిక్ పాలెట్, హెల్త్‌ కార్ట్‌ వంటి వాటిపై ఏకంగా 20 శాతం డిస్కౌంట్‌ని అందిస్తోంది. (షరతులు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు బ్యాంకు వెబ్‌సైట్‌ను వీక్షించండి.)
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని