Tata Steel Job cuts: టాటా స్టీల్‌లో 2,500 ఉద్యోగాల కోత

Tata Steel Job cuts: కర్బన ఉద్గార రహిత తయారీ ప్రక్రియను ప్రారంభించనున్న నేపథ్యంలో యూకేలో ఉద్యోగాల కోత తప్పడం లేదని టాటా స్టీల్‌ సీఈవో వెల్లడించారు.

Published : 02 Jun 2024 18:23 IST

Tata Steel Job cuts | దిల్లీ: టాటా స్టీల్‌ 2,500 మంది ఉద్యోగులను తొలగించేందుకు (Tata Steel Job cuts) సిద్ధమైంది. యూకే కార్యకలాపాల నుంచి ఈ మేరకు సిబ్బందిని తీసివేయనున్నట్లు తెలిపింది. అక్కడి తయారీ విధానంలో సమూల మార్పులు చేస్తున్న నేపథ్యంలో ఇది తప్పడం లేదని పేర్కొంది. ఉద్యోగాల కోతలను అక్కడి కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి.

భారత్‌ కేంద్రంగా పనిచేస్తున్న టాటా స్టీల్‌ (Tata Steel) యూకేలోనే అతిపెద్ద ఉక్కు తయారీ కంపెనీ. ఏటా దాదాపు మూడు మిలియన్‌ టన్నుల స్టీల్‌ను ఉత్పత్తి చేస్తోంది. 8,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కర్బన ఉద్గార రహిత ప్రణాళికల్లో భాగంగా తయారీలో బ్లాస్ట్‌ ఫర్నేస్‌కు బదులు ‘ఎలక్ట్రిక్‌ ఆర్క్‌ ఫర్నేస్‌’ ప్రక్రియకు బదిలీ అవుతోంది. తద్వారా ఉత్పత్తి సామర్థ్యం పెరగటంతో పాటు ఉద్గారాలూ గణనీయంగా తగ్గుతాయని సీఈఓ నరేంద్రన్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే 2,500 ఉద్యోగాల కోతలు తప్పడం లేదని స్పష్టం చేశారు. వచ్చే మూడేళ్లలో కర్బన ఆధారిత తయారీని యూకేలో పూర్తిగా నిలిపివేయాలని టాటా స్టీల్‌ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు.

యూకే వ్యాపారం నుంచి టాటా స్టీల్‌ (Tata Steel) జనవరి-మార్చి త్రైమాసికంలో 647 మిలియన్ పౌండ్ల ఆదాయాన్ని ఆర్జించింది. EBITDA నష్టం 34 మిలియన్‌ పౌండ్లుగా నివేదించింది. మరోవైపు బుధవారం ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ రూ.554.56 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన 64.59 శాతం తగ్గుదల నమోదు కావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని