JSW Cement: రాజస్థాన్‌లో రూ.3 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న JSW సిమెంట్‌

రాజస్థాన్‌లో కొత్త సిమెంట్‌ తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు JSW సిమెంట్‌ రూ.3,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

Published : 21 May 2024 17:39 IST

దిల్లీ: JSW గ్రూప్‌లో భాగమైన JSW సిమెంట్‌ రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లాలో కొత్త సిమెంట్‌ తయారీ కేంద్రంలో రూ.3,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. దీనికి డెట్‌, ఈక్విటీ ద్వారా నిధులు సమకూరుస్తామని కంపెనీ తెలిపింది. ఈ యూనిట్‌లో క్లింకరైజేషన్‌, గ్రైండింగ్‌ యూనిట్లు, 18 మెగావాట్ల వేస్ట్‌ హీట్‌ రికవరీ ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి వ్యవస్థ ఉంటాయి. దీని ద్వారా 1,000కి పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా. గనుల నుంచి సిమెంట్‌ తయారీ కర్మాగారానికి సున్నపురాయిని రవాణా చేయడానికి 7 కిలోమీటర్ల ఓవర్‌ల్యాండ్‌ బెల్ట్‌ కన్వేయర్‌ కూడా ఉంది.

రాజస్థాన్‌లోని తమ పెట్టుబడుల్లో ఈ పెట్టుబడి ఒకటని JSW సిమెంట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పార్ధ్‌ జిందాల్‌ తెలిపారు. ప్రస్తుతం JSW సిమెంట్‌ వార్షికంగా 1.90 కోట్ల టన్నుల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ సామర్థ్యాన్ని 6 కోట్ల టన్నులకు పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత తయారీ యూనిట్లు కర్ణాటకలోని విజయనగర్‌, ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల, పశ్చిమ బెంగాల్‌లోని సల్బోని, ఒడిశాలోని జాజ్‌పూర్‌, మహారాష్ట్రలోని డోల్విలో ఉన్నాయి. JSW సిమెంట్‌, దాని అనుబంధ సంస్థ శివ సిమెంట్‌ ద్వారా ఒడిశాలో క్లింకర్‌ యూనిట్‌ను కూడా నిర్వహిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని