LIC: హెల్త్‌ ఇన్సూరెన్స్‌లోకి ఎల్‌ఐసీ.. కొనుగోళ్లపై దృష్టి..!

LIC: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సెక్టార్‌లోకి ప్రవేశించాలనుకుంటోంది.

Published : 28 May 2024 14:05 IST

LIC ఇంటర్నెట్ డెస్క్‌: జీవిత బీమాలో అగ్రగామి సంస్థగా వెలుగొందుతున్న ఎల్‌ఐసీ (LIC).. ఆరోగ్య బీమా రంగంలోకి (Health Insurance) అడుగుపెట్టాలని చూస్తోంది. ఇందులో భాగంగా కొనుగోళ్లపై దృష్టి సారించనుంది. ఎల్‌ఐసీ క్యూ4 ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ ఛైర్మన్‌ సిద్ధార్థ్‌ మొహంతీ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నారు. పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదించిన కాంపోజిట్‌ లైసెన్స్‌ను అనుసరించి రంగం సిద్ధం చేసుకుంటున్ననట్లు తెలిపారు.

కొత్త ప్రభుత్వంలో కాంపోజిట్‌ లైసెన్స్‌ లభించే అవకాశం ఉందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ రంగం పట్ల ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. అయితే, సాధారణ బీమాలో తమకు పెద్దగా అనుభవం లేదని, అందుకే ఇన్‌ ఆర్గానిక్‌గా ఎదగాలని భావిస్తున్నామన్నారు. ఇందుకోసం ఈ రంగంలో ఉన్న కంపెనీలను కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్టు చెప్పారు.

ప్రస్తుతం జీవిత బీమా కంపెనీలకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రయోజనాలను అందించడానికి వీల్లేదు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంటరీ కమిటీ కొన్ని కీలక ప్రతిపాదనలు చేసింది. ఇన్సూరెన్స్‌ ప్రొవైడర్లకు కాంపోజిట్‌ లైసెన్స్‌ను మంజూరు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. దీనివల్ల ఆయా సంస్థలకు ఖర్చులు తగ్గడంతో పాటు ఆయా సంస్థలపై నియంత్రణపరమైన భారాలు తగ్గుతాయని సూచించింది. ఇందుకోసం బీమా చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే బీమా రంగంలోకి ఎల్‌ఐసీ ఎంట్రీ సుగమం అవుతుంది. ఒకవేళ ఎల్‌ఐసీఈ ఈ సెక్టార్‌లోకి ప్రవేశిస్తే బీమా కవరేజీ విస్తృతి పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని