Super Billionaires: సూపర్‌ బిలియనీర్లలో అంబానీ - అదానీ

Eenadu icon
By Business News Desk Updated : 28 Feb 2025 05:23 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దిల్లీ: ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన 24 మంది సూపర్‌ బిలియనీర్ల జాబితాను ‘ది వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ విడుదల చేసింది. సంపద నికర విలువ కనీసం 50 బిలియన్‌ డాలర్లు (సుమారు  రూ.4.35 లక్షల కోట్లు) ఉన్న వారిని సూపర్‌ బిలియనీరుగా సంస్థ పరిగణించింది. ఈ 24 మందిలో 16 మంది సెంటి బిలియనీర్ల (100 బిలియన్‌ డాలర్లు/రూ.8.7 లక్షల కోట్ల)ని నివేదిక తెలిపింది. వీరందరి సంపద విలువ కలిపితే 3.3 లక్షల కోట్ల డాలర్లని, ఫ్రాన్స్‌ జీడీపీకి ఇది సమానమని పేర్కొంది. ఇందులో మనదేశం నుంచి ముకేశ్‌ అంబానీ (90.6 బి.డాలర్లు), గౌతమ్‌ అదానీ (60.6 బి.డాలర్లు)కి చోటు దక్కింది. 419.4 బిలియన్‌ డాలర్ల సంపదతో ఎలాన్‌ మస్క్‌ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. జెఫ్‌బెజోస్‌ (263.8 బి.డా.), బెర్నార్డ్‌ అర్నాల్ట్‌ (238.9 బి.డా.), లారీ ఎలిసన్‌ (237 బి.డా.), జుకర్‌బర్గ్‌ (220.8 బి.డా.), సెర్గీ బ్రిన్‌ (160.5 బి.డా.), స్టీవ్‌బామర్‌ (157.4 బి.డా.), వారెన్‌ బఫెట్‌ (154.2 బి.డా.), జేమ్స్‌ వాల్టన్‌ (117.5 బి.డా.), శామ్యూల్‌ రాబ్‌సన్‌ వాల్టన్‌ (114.4 బి.డా.) ఈ జాబితాలోని తొలి 10 మందిలో ఉన్నారు.

Tags :
Published : 28 Feb 2025 03:45 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని