Atlas: ఓపెన్‌ ఏఐ బ్రౌజర్‌ అట్లాస్‌ ఆవిష్కరణ

Eenadu icon
By Business News Team Updated : 22 Oct 2025 10:44 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

OpenAI | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీ (ChatGPT) ద్వారా వినియోగదారులను ఆకట్టుకున్న ఓపెన్ఏఐ సంస్థ (OpenAI) కృత్రిమమేధ రంగంలో మరో ముందడుగు వేసింది. అట్లాస్‌ (ChatGPT Atlas) పేరుతో బ్రౌజర్‌ను ఆవిష్కరించింది. కృత్రిమ మేధతో పనిచేసేలా దీనిని రూపొందించినట్లు కంపెనీ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌ వెల్లడించారు. యాపిల్‌ మ్యాక్‌ ఓఎస్‌లో అట్లాస్‌ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఇది గూగుల్‌ బ్రౌజర్‌ లాగానే పని చేసినా.. మరికొన్ని సరికొత్త ఫీచర్లు, ఇంటర్‌ఫేస్‌ను కూడా ఇందులో అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. తాము రూపొందించిన బ్రౌజర్‌ గూగుల్‌ క్రోమ్‌కు బలమైన పోటీ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. 

కృత్రిమమేధ (AI) రంగంలో తనదైన ముద్ర వేయడానికి ఓపెన్‌ ఏఐ అట్లాస్ అనే AI-ఆధారిత బ్రౌజర్‌ను ప్రారంభించింది. చాట్‌జీపీటీ (ChatGPT)తో రూపొందించిన ఈ బ్రౌజర్ వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకోవడమే కాకుండా వారి లక్ష్యాలను సాధించడంలో సహాయపడే ‘సూపర్-అసిస్టెంట్’ను రూపొందించడంలో తమకు సహకారం అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులోని సైడ్‌బార్‌లో ఉండే ‘ఆస్క్‌ చాట్‌జీపీటీ’ దీని ద్వారా వినియోగదారులు వెబ్‌సైట్‌లో నేరుగా తమ ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. 

అట్లాస్‌(Atlas)ను ఓపెస్‌ఏఐతో అనుసంధానించడం వల్ల ఈ బ్రౌజర్‌ సహాయంతో వినియోగదారులు హోటల్‌ బుకింగ్‌లు, కిరాణా సామగ్రిని కొనుగోలు చేయడం, నోట్స్‌ను ఎడిట్‌ చేసుకోవడం వంటివి చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లాస్‌ మొదట macOS వెర్షన్‌లో అందుబాటులోకి వస్తోంది. కంపెనీ Windows, iOS, Android వెర్షన్‌లను తర్వాత విడుదల చేయాలని చెబుతోంది. అదనంగా.. ఉచిత చాట్‌జీపీటీ వినియోగదారులకు కూడా అట్లాస్‌ అందుబాటులో ఉంటుంది. 

Tags :
Published : 22 Oct 2025 10:03 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని