Paytm: పీపీబీఎల్‌ ఛైర్మన్‌ పదవికి విజయ్‌శేఖర్‌ శర్మ రాజీనామా

పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌ (PPBL) ఛైర్మన్ పదవికి సోమవారం రాజీనామా చేశారు.

Updated : 26 Feb 2024 21:51 IST

ముంబయి: పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌ (PPBL) ఛైర్మన్ పదవికి సోమవారం రాజీనామా చేశారు. బోర్డు సభ్యత్వం నుంచీ ఆయన వైదొలిగారు. ఈ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో విజయ్‌ శేఖర్‌ శర్మ రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే డిపాజిట్లను, క్రెడిట్‌ లావాదేవీలను నిలిపివేయాలని పేటీఎంకు ఆర్‌బీఐ సూచించింది. ఫాస్టాగ్‌లను మార్చి 15 తర్వాత రీఛార్జి చేయడానికి కుదరదు. అందులో నగదు పూర్తయ్యే వరకే వినియోగించే వెసులుబాటు ఉంది. 

మరోవైపు పీపీబీఎల్‌ బోర్డు పునర్నిర్మాణం కూడా పూర్తయినట్లు పేటీఎం మాతృసంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్‌ లిమిటెడ్‌ వెల్లడించింది. బోర్డు డైరెక్టర్లుగా సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్‌ శ్రీనివాసన్‌ శ్రీధర్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అశోక్‌కుమార్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి దేవేంద్రనాథ్‌ సారంగి, మాజీ ఐఏఎస్‌ రజినీ సెఖ్రీ సిబల్‌ నియమితులైనట్లు పేర్కొంది. త్వరలోనే బోర్డు కొత్త ఛైర్మన్‌ ఎంపిక ప్రక్రియను పీపీబీఎల్‌ ప్రారంభించనుందని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని