RBI: రెండు బ్యాంకులు సహా ఫైనాన్స్ సంస్థకు ఆర్‌బీఐ జరిమానా

మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరించాయనే కారణంతో రెండు బ్యాంకులు, ఒక ఫైనాన్స్ సంస్థకు ఆర్‌బీఐ జరిమానా విధించింది.                                    

Published : 13 Oct 2023 19:06 IST

ముంబయి: రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (RBI) రెండు బ్యాంకులు, ఒక ఫైనాన్స్ సంస్థకు జరిమానా విధించింది. ఈ మేరకు శుక్రవారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేసింది. ఆర్‌బీఐ జరిమానా విధించిన వాటిలో ఒకటి ప్రభుత్వ రంగ బ్యాంకు కావడం గమనార్హం. ఆర్‌బీఐ మార్గదర్శకాలను పాటించని కారణంగా యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (UBI), ఆర్‌బీఎల్‌ బ్యాంకు, బజాజ్‌ ఫైనాన్స్ సంస్థలకు జరిమానా విధించినట్లు తెలిపింది.

మోసపూరిత లావాదేవీల విషయంలో బ్యాకింగేతర ఆర్థిక సంస్థ (NBFC)లకు నిర్దేశించిన మార్గదర్శకాలను బజాజ్‌ ఫైనాన్స్ సంస్థ పాటించలేదని ఆర్‌బీఐ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలోనే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందనే కారణంతో రూ.8.50 లక్షలు జరిమానా విధించించినట్లు పేర్కొంది. రుణాలు - అడ్వాన్స్‌లకు సంబంధించి ఆర్‌బీఐ విధించిన ఇతర పరిమితుల నిబంధనలను పాటించని కారణంగా యూబీఐకు రూ.కోటి జరిమానా విధించింది. మార్చి 31, 2021లో ఆర్‌బీఐ తనిఖీల్లో ఈ విషయం బయటపడినట్లు వెల్లడించింది. ఇక, ఆర్‌బీఎల్‌ బ్యాంకు.. ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకు షేర్లకు సంబంధించిన ఓటింగ్‌ ప్రక్రియను ముందస్తుగా నిర్వహించిదనే కారణంతో రూ. 64 లక్షలు జరిమానా విధించినట్లు వివరించింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని