Stock market: రోజంతా నష్టాల్లోనే సూచీలు

Stock market: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 352, నిఫ్టీ 90 పాయింట్ల మేర నష్టపోయాయి.

Updated : 26 Feb 2024 17:10 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో ఐటీ, బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో రోజంతా సూచీలు నష్టాల్లోనే కొనసాగాయి. నిఫ్టీ 21,150 స్థాయిని కోల్పోయింది. సెన్సెక్స్‌ ఉదయం 73,044.81 పాయింట్ల (క్రితం ముగింపు  73,142.80) వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 72,666.82 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 352.67 పాయింట్ల నష్టంతో 72,790.13 వద్ద ముగిసింది. నిఫ్టీ 90.65 పాయింట్ల నష్టంతో 22,122.05 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్‌లో ఎల్‌అండ్‌టీ, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాల్లో ముగిశాయి. పేటీఎం షేరు ఇవాళ 4.99 శాతం మేర లాభంతో రూ.428.10 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.89గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్ ధర 81.19 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 2042 వద్ద ట్రేడవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని