Stock market: గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణ.. ఫ్లాట్‌గా సూచీలు..

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 58 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 29 పాయింట్ల లాభపడింది.

Published : 09 Apr 2024 16:07 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం భారీ లాభాలతో సరికొత్త జీవనకాల గరిష్ఠాలను సూచీలు నమోదు చేశాయి. సెన్సెక్స్‌ తొలిసారి 75 వేలు మార్కును దాటగా.. నిఫ్టీ కూడా 22,750 పాయింట్ల ఎగువకు చేరింది. గరిష్ఠాల వద్ద మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. త్వరలో క్యూ4 ఫలితాలు వెలువడనుండడం, అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు పెరగడం వంటి కారణాలతో మదుపరులు అప్రమత్తతకు కారణం.

సెన్సెక్స్‌ ఉదయం ఆరంభంలోనే 75,124.28 పాయింట్ల రికార్డు గరిష్ఠాల వద్ద ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు లాభాల జోరు కొనసాగింది. తర్వాత క్రమంగా పడుతూ వచ్చింది. ఇంట్రాడేలో 74,603.37 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 58.80 పాయింట్ల నష్టంతో 74,683.70 వద్ద ముగిసింది. నిఫ్టీ 29.35 పాయింట్ల లాభంతో 22,695.65 వద్ద స్థిరపడింది. న్సెక్స్‌ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. టైటాన్‌, రిలయన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టెక్‌ మహీంద్రా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్‌ రకం బ్యారెల్‌ చమురు ధర 90.67 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ఔన్సు ధర 2379 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని