Stock market: ఐదు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌.. స్వల్ప లాభాల్లో సూచీలు

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 75 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

Published : 31 May 2024 16:20 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు (Stock market) స్వల్ప లాభాల్లో ముగిశాయి. జూన్‌ 1న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు, శుక్రవారం సాయంత్రం జీడీపీ గణాంకాలు వెలువడనున్న వేళ స్టాక్‌ మార్కెట్లలో కొనుగోళ్ల కళ కనిపించింది. ముఖ్యంగా ఫైనాన్షియల్‌ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు కలిసొచ్చింది. ఆఖర్లో అమ్మకాలతో లాభాలు పరిమితమైనప్పటికీ.. సూచీల ఐదు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ పడింది.

సెన్సెక్స్ ఉదయం 74,208.53 పాయింట్లతో లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 73,765.15- 74,478.89 పాయింట్ల మధ్య కదలాడింది. చివరికి 75.71 పాయింట్లు లాభపడి 73,885.60 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 42.05 పాయింట్ల లాభంతో 22,530.70 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.49గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్ షేర్లు లాభపడ్డాయి. నెస్లే ఇండియా, టీసీఎస్‌, మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్ ధర 81.40 వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2363 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని