Stock market: రెండోరోజూ రాణించిన స్టాక్‌ మార్కెట్‌.. 75 వేలు దాటిన సెన్సెక్స్‌

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు రాణించాయి. సెన్సెక్స్‌ 692 పాయింట్లు, నిఫ్టీ 201 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

Published : 06 Jun 2024 16:09 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు (Stock market) వరుసగా రెండోరోజూ రాణించాయి. మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుండడం ఇందుకు నేపథ్యం. ప్రభుత్వ ఏర్పాటుకు కీలకంగా మారిన తెదేపా, జేడీయూ ఎన్డీయేకు భేషరుతుగా మద్దతు తెలపడంతో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటు లాంఛనం కానుంది. ఈనేపథ్యంలో పుంజుకున్న సూచీలు లాభాలతో కళకళలాడాయి. సెన్సెక్స్‌ మళ్లీ 75 వేల మార్కు దాటింది.

సెన్సెక్స్‌ ఉదయం 75,078.70 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 75,297.73 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 692.27 పాయింట్ల లాభంతో 75,074.51 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 201.05 పాయింట్ల లాభంతో 22,821.40 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.49గా ఉంది. సెన్సెక్స్‌లో టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇన్ఫోసిస్‌, ఎన్టీపీసీ షేర్లు లాభపడగా.. హిందుస్థాన్‌ యూనిలీవర్‌, ఏషియన్‌ పెయింట్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, నెస్లే ఇండియా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధరర 78.70 డాలర్ల వద్ద.. బంగారం ఔన్సు ధర 2,379 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.

  • రాణించిన హెరిటేజ్‌ ఫుడ్స్‌: హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ షేర్లు రాణించాయి. బుధవారం 20 శాతం లాభంతో అప్పర్‌ సర్క్యూట్‌ తాకిన ఈ షేరు.. గురువారం మరో 10 శాతం మేర పెరిగి రూ.601.15 వద్ద ముగిసింది. అమరరాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ లిమిటెడ్‌ షేరు 5.39% 1,283 వద్ద ముగిసింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని