Stock Market: ఫ్లాట్‌గా మొదలైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market Opening bell: స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్వల్ప లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్‌ 76,500 మార్క్‌పైన, నిఫ్టీ 23,250 మార్క్‌ దాటి ట్రేడ్‌ అవుతున్నాయి.

Updated : 11 Jun 2024 09:57 IST

Stock Market Opening bell ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ.. దేశీయంగా కొనసాగుతున్న రాజకీయ పరిణామాలపై దృష్టిపెట్టిన మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. దీంతో ప్రీ ట్రేడింగ్‌లో నష్టాల్లో సాగిన సూచీలు (Stock Market).. ప్రస్తుతం కాస్త కోలుకుని స్వల్ప లాభాల్లో సాగుతున్నాయి. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్‌ (Sensex) 50 పాయింట్ల లాభంతో 76,539.87, నిఫ్టీ (Nifty) 22 పాయింట్ల లాభంతో 23,281 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.

ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, అపోలో హాస్పిటల్స్‌, నెస్లే, కోల్‌ ఇండియా షేర్లు లాభాల్లో ఉండగా.. ఏషియన్‌ పెయింట్స్‌, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, భారత్‌ పెట్రోలియం, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటామోటార్స్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు సోమవారం కొత్త రికార్డుల్లో ముగిశాయి. ఫెడ్‌ సమావేశంపై సానుకూల అంచనాలతో నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ 500, డోజోన్స్‌ సూచీలు లాభపడ్డాయి. అటు ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు మంగళశవారం మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. జపాన్‌ నిక్కీ, దక్షిణ కొరియా కోస్పి, తైవాన్‌ సూచీ లాభాల్లో ఉండగా.. హాంకాంగ్‌, ఆస్ట్రేలియా మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు