Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 22,599

Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ 22 పాయింట్ల లాభంతో 74,243 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 2 పాయింట్ల స్వల్ప లాభంతో 22,599 దగ్గర కొనసాగుతోంది.

Published : 23 May 2024 09:37 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు మన మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ 22 పాయింట్ల లాభంతో 74,243 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 2 పాయింట్ల స్వల్ప లాభంతో 22,599 దగ్గర కొనసాగుతోంది. బుద్ధ పూర్ణిమ నేపథ్యంలో నేటి కరెన్సీ మార్కెట్లు పనిచేయడం లేదు.

సెన్సెక్స్‌-30 (Sensex) సూచీలో ఏషియన్‌ పెయింట్స్‌, ఇండస్‌ఇండ్, ఎల్‌ అండ్‌ టి, యాక్సిస్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, టైటన్‌, విప్రో, రిలయన్స్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టీసీఎస్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. పవర్‌గ్రిడ్‌, సన్‌ ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, నెస్లే ఇండియా, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, మారుతీ, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టపోతున్న జాబితాలో ఉన్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) బుధవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఆసియా-పసిఫిక్‌ సూచీలు నేడు అదే బాటలో పయనిస్తున్నాయి. ద్రవ్యోల్బణ కట్టడి విషయంలో పురోగతి లేకపోవటంపై ఫెడరల్‌ రిజర్వ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూలంగా స్పందిస్తున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) బుధవారం నికరంగా రూ.686 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.962 కోట్ల వాటాలను కొనుగోలు చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 81.58 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు