Term Insurance: టర్మ్‌ బీమా ప్రీమియంలు ఎంతెంత?

చిన్న వయసులోనే జీవిత బీమా తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. వివిధ బీమా సంస్థలు వసూలు చేసే ప్రీమియంలు ఎంతెంతున్నాయో ఇక్కడ చూడండి.

Updated : 11 Apr 2024 17:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జీవిత బీమా అవసరం చాలా మందికి తెలిసింది. సంపాదించే వ్యక్తి (కుటుంబ పెద్ద) దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఏ కారణం చేతనైనా మరణిస్తే.. అతడిపై ఆధారపడిన కుటుంబానికి ఈ బీమా కొండంత అండగా ఉంటుంది. జీవిత బీమా పాలసీలలో అతి తక్కువ ప్రీమియంతో మంచి బీమా హామీ అందించగలిగేది టర్మ్ ప్లాన్. ట‌ర్మ్ ఇన్సూరెన్స్ పాల‌సీలో క‌వ‌రేజ్ మొత్తాన్ని అంచ‌నా వేసేట‌ప్పుడు.. మీ ఆదాయం, ఆర్థిక ల‌క్ష్యాలు, భ‌విష్య‌త్‌ ద్ర‌వ్యోల్బ‌ణ రేటు ఇవ‌న్నీ దృష్టిలో పెట్టుకోవాలి. మీ ప్ర‌స్తుత వార్షిక ఆదాయానికి 10-12 రెట్ల‌కు స‌మాన‌మ‌య్యే బీమా పాల‌సీని తీసుకుంటే మంచిద‌ని నిపుణులు స‌ల‌హా ఇస్తున్నారు. మీకు వ‌ర్తించే ప్రీమియం మీ వ‌య‌సు, ఆదాయం, జెండ‌ర్‌, పాల‌సీ ఫీచ‌ర్లు, మీరు ఎంచుకున్న బీమా సంస్థ నిర్దేశించిన ఇత‌ర ష‌ర‌తులపై ఆధార‌ప‌డి ఉంటుంది.

ఒక వ్య‌క్తి చిన్న వ‌య‌సులోనే ట‌ర్మ్ ఇన్సూరెన్స్ పాల‌సీని పొందితే ప్రీమియం సాధార‌ణంగా త‌క్కువ ఉంటుంది. అయితే ధూమ‌పానం (పొగ‌) అలవాటు ఉన్న వ్య‌క్తుల‌కైతే ప్రీమియం 50-80% ఎక్కువ ఉంటుంది. ధూమపానం చేసేవారు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడతారని అనేక ఆరోగ్య నివేదికలు చెబుతున్నాయి. పొగాకు వాడకం వల్ల గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌, శ్వాసకోశ సమస్యలు వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఫలితంగా బీమా సంస్థలు ధూమపానం చేసేవారిని ‘అధిక ప్రమాదకర వ్యక్తులు'గా పరిగణిస్తాయి. అందుచేత ధూమపానం చేసేవారు బీమాను క్లెయిం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని బీమా కంపెనీలు భావిస్తాయి. కాబట్టి, ఈ అలవాటు ఉన్నవారికి బీమా సంస్థలు ఎక్కువ బీమా ప్రీమియంలను వసూలు చేస్తాయి.

ధూమ‌పానం చేయ‌ని/చేసే 30 సంవ‌త్స‌రాల వ్య‌క్తి వ‌య‌సు ఆధారంగా ప్రీమియంలు తెలిపాం. 30 సంవత్స‌రాల కాలవ్య‌వ‌ధితో, రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ట‌ర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాల‌నుకునే వారికి 10 ట‌ర్మ్ ఇన్సూరెన్స్ పాల‌సీల జాబితాను..సూచించే వార్షిక ఈఎంఐల‌ను దిగువ పట్టికలో అందిస్తున్నాం.

గమనిక: ధూమపానం చేసే వ్యక్తికి కొన్నిసార్లు, కొన్ని బీమా కంపెనీలు బీమా పాలసీని ఇవ్వకపోవచ్చు. సాధారణంగా ఆరోగ్య పరీక్షలు చేసే అవకాశం ఉంది. దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని