స్థిరమైన ఆదాయంతో

Eenadu icon
By Business News Team Updated : 31 Oct 2025 01:43 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా యాక్సిస్‌ ఇన్‌కమ్‌ ప్లస్‌ ఆర్బిట్రేజ్‌ పాసివ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ (ఎఫ్‌ఓఎఫ్‌) పథకాన్ని తీసుకొచ్చింది. ఇది పాసివ్‌ రుణ మ్యూచువల్‌ ఫండ్‌ స్కీములు, ఆర్బిట్రేజ్‌ ఫండ్ల యూనిట్లలో పెట్టుబడి పెట్టే ఓపెన్‌ ఎండెడ్‌ ఎఫ్‌ఓఎఫ్‌ పథకం. ఈ పథకం పనితీరుకు నిఫ్టీ షార్ట్‌ డ్యూరేషన్‌ డెట్‌ ఇండెక్స్‌ (65 శాతం), నిఫ్టీ 50 ఆర్బిట్రేజ్‌ టీఆర్‌ఐ (35 శాతం) కొలమానంగా ఉంటాయి. ఎన్‌ఎఫ్‌ఓ చివరి తేదీ నవంబరు 11. ఈ పథకం స్థిరమైన ఆదాయాన్ని ఆర్జిస్తుందని అంచనా. అంతేకాకుండా వడ్డీ రేట్లలో వచ్చే మార్పులతో ఎదురయ్యే రిస్కును తగ్గించుకోవచ్చు. పెట్టుబడుల్లో 35-50 శాతాన్ని ఆర్బిట్రేజ్‌ ఫండ్ల యూనిట్లకు కేటాయిస్తారు. 

అందువల్ల మార్కెట్లో ఎదురయ్యే హెచ్చుతగ్గుల నుంచి ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. రుణ పథకాల స్థాయిలో ప్రతిఫలం, 24 నెలల పెట్టుబడి కాలం తర్వాత యూనిట్లు విక్రయిస్తే వచ్చే లాభాలపై ఈక్విటీ పెట్టుబడుల తరహాలో 12.5 శాతం పన్ను చెల్లింపు సదుపాయం ఉండటం అదనపు ఆకర్షణలు. ఫండ్‌ మేనేజర్లు.. ఆదిత్య పగారియా, హార్ధిక్‌సత్రా, కార్తీక్‌ కుమార్‌.


బంగారంపై సులువుగా

ఛాయిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ డిజిటల్‌ పద్ధతిలో బంగారంపై పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కల్పిస్తూ ఒక ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ (ఈటీఎఫ్‌)ను తీసుకొచ్చింది. ఛాయిస్‌ గోల్డ్‌ ఈటీఎఫ్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 31. ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ.1,000. పసిడి ధర ఈ మధ్య కాలంలో బాగా పెరిగిన విషయం విదితమే. కొద్ది రోజులుగా ధర దిగివస్తోంది. అయినప్పటికీ దీర్ఘకాలంలో బంగారం ధర పెరిగే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. కాబట్టి, దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టే లక్ష్యం ఉన్న మదుపరులకు ఇలాంటి పథకాలు అనువుగా ఉంటాయి.


మధ్యస్థాయి కంపెనీల్లో

మధ్యస్థాయి (మిడ్‌క్యాప్‌) కంపెనీల్లో పెట్టుబడి పెట్టి, లాభాలు ఆర్జించే లక్ష్యంతో రెండు పథకాలను గ్రో మ్యూచువల్‌ ఫండ్‌ తీసుకొచ్చింది. గ్రో నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 ఈటీఎఫ్, గ్రో నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 ఇండెక్స్‌ ఫండ్‌ అనే ఈ పథకాలను పాసివ్‌ పద్ధతిలో నిర్వహిస్తారు. ఇందులో ఒకటి ఈటీఎఫ్‌ (ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌)కాగా, మరోటి ఇండెక్స్‌ ఫండ్‌. ఈ రెండు పథకాల ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు వచ్చే నెల 11. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.500. ఈ పథకాల పనితీరుకు నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 ఇండెక్స్‌ టీఆర్‌ఐ కొలమానంగా ఉంటుంది. ప్రధానంగా నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 ఇండెక్స్‌లో భాగంగా ఉన్న షేర్లతో ఈ పథకాల పోర్ట్‌ఫోలియోను సిద్ధం చేస్తారు. ఫండ్‌ మేనేజర్లు.. శశికుమార్, నిఖిల్‌ సాతమ్, ఆకాష్‌ చౌహాన్‌. 

Tags :
Published : 31 Oct 2025 00:52 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు