Gautam Adani: విదేశీ పౌరులను పిలిపించే అధికార పరిధి యూఎస్ సెక్‌కి లేదు!

న్యూయార్క్: అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన సోదరుడి కుమారుడు సాగర్‌లకు సరైన దౌత్య మార్గాల ద్వారా సమన్లు అందజేయాల్సి ఉంటుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. విదేశీ పౌరులను పిలిపించే అధికార పరిధి అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (యూఎస్ సెక్)కు లేదని పేర్కొన్నారు. సౌర విద్యుత్ సరఫరా కాంట్రాక్టులను పొందేందుకు 265 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2,200 కోట్ల) లంచం ఇచ్చారన్న ఆరోపణలపై సమాధానం తెలియజేయాలని యూఎస్ సెక్ సమన్లు జారీ చేసిందని వార్తలొచ్చాయి. అహ్మదాబాద్‌లోని అదానీ శాంతివన్ ఫామ్ హౌస్, ఇదే నగరంలో సాగర్‌కు చెందిన బోదక్‌దేవ్ నివాసానికి సమన్లు పంపారని, వీటిని అందుకున్న తదుపరి రోజు నుంచి 21 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని అందులో సూచించినట్లు సమాచారం. ఒకవేళ వీటికి స్పందించకపోతే వారికి వ్యతిరేకంగా తీర్పు వెలువడుతుందని అందులో తెలిపింది. అయితే ఇప్పటివరకు అదానీలకు ఎలాంటి సమన్లు అందలేదని తెలుస్తోంది. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా ఇతర దౌత్య మార్గాలను అనుసరించి అదానీలకు సమన్లు జారీ చేయాల్సి ఉంటుందని ఈ వ్యవహారంతో దగ్గరి సంబంధమున్న వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


