Skills for entry level Jobs: ఈ స్కిల్స్‌తో ఫ్రెషర్లకు ఉద్యోగావకాశాలు : లింక్డిన్‌

Skills for entry level Jobs: ఫ్రెషర్లకు ఏయే స్కిల్స్‌ ఉంటే మెరుగైన ఉద్యోగావకాశాలు ఉన్నాయో లింక్డిన్‌ తాజా నివేదికలో వెల్లడించింది.

Published : 29 May 2024 12:50 IST

దిల్లీ: జాబ్‌ మార్కెట్‌లోకి ప్రవేశించబోయే ఫ్రెషర్లకు ప్రముఖ సామాజిక మాధ్యమం లింక్డిన్‌ నివేదిక కీలక సూచనలు చేసింది. డిజైన్‌, అనలిటిక్స్‌, ప్రోగ్రామింగ్‌ వంటి నైపుణ్యాలున్నవారికి (Job Skills) అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపింది.

బ్యాచిలర్స్‌ డిగ్రీ పూర్తి చేసిన వారికి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, సిస్టమ్‌ ఇంజినీర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అనలిస్ట్‌ ఉద్యోగాల్లో డిమాండ్‌ ఉందని లింక్డిన్‌ నివేదిక తెలిపింది. యువ ప్రొఫెషనల్స్‌కు యుటిలిటీస్‌ రంగంలోనూ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వెల్లడించింది. కమ్యూనిటీ అండ్‌ సోషల్‌ సర్వీసెస్‌, లీగల్‌, మార్కెటింగ్‌, మీడియా అండ్‌ కమ్యూనికేషన్‌ రంగాల్లోని కంపెనీలూ ఉద్యోగాలను ఆఫర్‌ చేస్తున్నాయని తెలిపింది.

‘‘కెరీర్‌ ఆరంభంలో జాబ్ మార్కెట్‌లోకి ప్రవేశించడం చాలా కష్టం. పరిశ్రమ ట్రెండ్‌లు, డిమాండ్‌లో ఉన్న ఉద్యోగాల గురించి అప్‌డేట్‌గా ఉండటం చాలా అవసరం. అంతగా ప్రాచుర్యంలో లేని ఉద్యోగాలను సైతం అన్వేషించాలి. అప్పుడే అనేక అవకాశాలు మన కళ్ల ముందుంటాయి’’ అని లింక్డిన్‌ కెరీర్‌ ఎక్స్‌పర్ట్‌ నిరజిత బెనర్జీ తెలిపారు. చాలా నైపుణ్యాలు ఒకటి కంటే ఎక్కువ పరిశ్రమల్లో ఉపయోగకరంగా ఉంటాయని గుర్తుచేశారు. ఏఐతో అలాంటివి వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. టెక్‌ ఆధారిత ఉద్యోగాల్లో వివిధ సబ్జెక్టుల్లో అవగాహన ఉన్నవారికి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగ అవకాశాలను మెరుగుపర్చుకోవడం కోసం ప్రొఫెనల్స్‌తో నెట్‌వర్క్‌ పెంచుకోవాలని, నైపుణ్యాలను సానబెట్టాలని ఫ్రెషర్స్‌కు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని