Road Accident: పెళ్లి వాహనాన్ని ఢీకొట్టిన డీసీఎం

Eenadu icon
By Crime News Desk Updated : 01 Nov 2025 04:59 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ముగ్గురి మృతి... 8 మందికి తీవ్రగాయాలు
ఎల్కతుర్తి-సిద్దిపేట జాతీయ రహదారిపై ఘటన

భీమదేవరపల్లి, న్యూస్‌టుడే: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ఎల్కతుర్తి-సిద్దిపేట జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ములుకనూరు ఎస్సై రాజు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం సుదనపల్లికి చెందిన నాగలక్ష్మికి, సిద్దిపేట జిల్లా నంగునూర్‌ మండలం వెంకటాపురానికి చెందిన భాస్కర్‌కు బుధవారం వివాహం జరిగింది. అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు గురువారం అబ్బాయి ఇంటివద్ద జరిగిన వేడుకకు హాజరై నూతన వధూవరులను తీసుకొని రాత్రి 8 గంటలకు సుదనపల్లికి ఓ ఎస్‌యూవీ వాహనంలో బయలుదేరారు.

గోపాల్‌పూర్‌ క్రాస్‌ రోడ్డు సమీపానికి రాగానే వాహనాన్ని పక్కకు నిలిపి..కొద్దిసేపటి తర్వాత స్టార్ట్‌ చేస్తున్న క్రమంలో ఎల్కతుర్తి వైపునుంచి అతివేగంగా వచ్చిన ఓ డీసీఎం వాహనం ఎస్‌యూవీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెడ్డబోయిన స్వప్న(15) అక్కడికక్కడే మృతి చెందింది. ఎస్సై రాజు ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను ప్రత్యేక అంబులెన్స్‌లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రెడ్డబోయిన కళమ్మ(55), రెడ్డబోయిన శ్రీనాథ్‌(5) మృతి చెందారు. ఈ ప్రమాదంలో చిన్నారులు సహా ఎనిమిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. నూతన వధూవరులు క్షేమంగా బయటపడ్డారు.

Tags :
Published : 01 Nov 2025 03:38 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు