crime news ‘బ్లాక్‌’ ముఠా అరెస్టు

బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సలో వాడే ఆంపిటెరిసిన్‌-బి ఇంజెక్షన్లను బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్న రెండుబ్లాక్‌ ఫంగస్‌ చికిత్సలో వాడే ఆంపిటెరిసిన్‌-బి ఇంజెక్షన్లను బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్న రెండు ముఠాలకు చెందిన తొమ్మిది మందిని టాస్క్‌ఫోర్స్‌

Updated : 18 Jun 2021 11:51 IST

హైదరాబాద్‌ : బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సలో వాడే ఆంపిటెరిసిన్‌-బి ఇంజెక్షన్లను బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్న రెండు ముఠాలకు చెందిన తొమ్మిది మందిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 28 ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. రూ.7వేలు ఉండే ఒక్కో ఇంజెక్షన్‌ ను రూ.35వేల నుంచి 50వేల వరకు ఈ ముఠా విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

 ఎస్‌ఆర్‌నగర్‌, జూబ్లీహిల్స్‌లో డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించిన పోలీసులు నిందితులను వలపన్ని పట్టుకున్నారు. మొదటి ముఠాలో మెడికల్‌ రిప్రజెంటిటివ్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్‌ పలువురి నుంచి కమిషన్‌పై ఇంజెక్షన్లు అమ్మిపెడతానంటూ తీసుకుని విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మరో నలుగురితో కలిసి దందా నిర్వహిస్తున్నాడని వివరించారు.  రెండో ముఠాలో బాలస్వామి ప్రధాన నిందితుడని వెల్లడించారు. అక్రమంగా ఇంజెక్షన్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ స్పష్టం చేశారు. గుంటూరుకు చెందిన మరో నిందితుడు పరారీలో ఉన్నట్టు సీపీ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని