వైకాపా అరాచకం.. తాగునీటి కోసం వెళితే ట్యాంకర్‌తో తొక్కించి చంపేశారు

పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మల్లవరంలో దారుణం చోటు చేసుకుంది.

Updated : 01 Mar 2024 19:17 IST

రెంటచింతల: పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మల్లవరంలో దారుణం చోటు చేసుకుంది. తాగునీటి కోసం వెళ్లిన గిరిజన మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపేసిన ఘటన కలకలం రేపింది. గ్రామంలో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయడంతో బాణావత్‌ సామిని అనే మహిళ అక్కడికి వెళ్లింది. తెదేపా వర్గానికి చెందిన వారికి నీరు ఇచ్చేది లేదని.. వైకాపాకు చెందిన డ్రైవర్‌ ట్యాంకర్‌ను ముందుకు పోనిచ్చాడు. ఈక్రమంలో వాహనం ఢీకొని బాధితురాలు తీవ్రంగా గాయపడింది. మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందింది. ఈ ఘటనను మాచర్ల తెదేపా ఇన్‌ఛార్జి బ్రహ్మారెడ్డి తీవ్రంగా ఖండించారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తెదేపా సానుభూతి పరులకు తాగునీరు సరఫరా చేయకుండా వైకాపా నేతలు దారుణంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. నీటి కోసం వెళ్తే ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తారా? అని మృతురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని