బెంగళూరు రేవ్‌ పార్టీ.. తెలుగు నటికి డ్రగ్‌ పాజిటివ్‌: పోలీసులు

బెంగళూరు రేవ్‌ పార్టీలో పట్టుబడిన వారిలో 103 మందికి డ్రగ్‌ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు.

Updated : 23 May 2024 13:28 IST

బెంగళూరు: బెంగళూరు రేవ్‌ పార్టీలో పట్టుబడిన వారిలో 103 మందికి డ్రగ్‌ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు. పలువురు నటుల రక్త నమూనాల్లో మాదకద్రవ్యాల ఆనవాళ్లు లభ్యమైనట్లు తెలిపారు. వారిలో తెలుగు నటి కూడా ఉన్నట్లు చెప్పారు.

నగర శివారులో ఆదివారం రాత్రి నిర్వహించిన రేవ్‌ పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. తెలుగు సినీ రంగానికి చెందిన కొందరు నటులు, బుల్లితెర నటులు, మోడల్స్, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరైనట్లు పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. వారంతా మత్తు పదార్థాలు తీసుకున్నారో.. లేదో పరీక్షించడానికి రక్తనమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపించామని తెలిపారు. ఈక్రమంలో తాజాగా డ్రగ్స్‌ పరీక్షల వివరాలు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని