Bonfire: చలేస్తోందని.. కదులుతోన్న రైలులో ‘పిడకల మంట’!

కదులుతోన్న రైలులో చలి మంట వేసిన ఇద్దరిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ ఘటన వెలుగుచూసింది.

Published : 06 Jan 2024 21:36 IST

లఖ్‌నవూ: చలినుంచి ఉపశమనం పొందేందుకు ఏకంగా కదులుతోన్న రైల్లోనే మంట (Bonfire) వేసిన ఇద్దరిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. అస్సాం నుంచి దిల్లీ బయల్దేరిన సంపర్క్‌ క్రాంతి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మార్గమధ్యంలో గేట్‌మ్యాన్‌ అప్రమత్తతతో పెనుముప్పు తప్పింది. ఆర్పీఎఫ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. దిల్లీ వెళ్తోన్న రైలు జనవరి 3న రాత్రి ఉత్తర్‌ప్రదేశ్‌లోని బర్హన్‌ స్టేషన్‌ సమీపానికి చేరుకుంది. రైల్వే క్రాసింగ్‌ వద్ద గేట్‌మ్యాన్‌ ఓ బోగీలో మంట, పొగను గుర్తించాడు.

కేరళలో పోయిన ఎయిర్‌పాడ్స్‌ గోవాలో దొరికాయ్‌.. అదెలా?

వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. తర్వాతి స్టేషన్‌లో రైలును నిలిపేశారు. ఆర్పీఎఫ్‌ సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించగా, జనరల్‌ బోగీలో కొంతమంది పిడకలతో చలి మంట వేసినట్లు గుర్తించి, తక్షణమే ఆర్పేశారు. అలీగఢ్‌ జంక్షన్‌కు చేరుకున్న తర్వాత ఈ ఘటనకు సంబంధించి మొత్తం 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన చందన్ (23), దేవేంద్ర (25)లు ఈ పనిచేసినట్లు తేలింది. వారిపై కేసు నమోదు చేయగా, మరో 14 మందిని హెచ్చరించి వదిలేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని