కేరళలో పోయిన ఎయిర్‌పాడ్స్‌ గోవాలో దొరికాయ్‌.. అదెలా?

సాంకేతికతను సమర్థంగా ఉపయోగించాలే గానీ ఏ పనైనా సులువుగా జరిగిపోతుంది. ముంబయికి చెందిన ఓ వ్యక్తి విషయంలో జరిగిన ఉదంతమే ఇందుకు ఉదాహరణ.

Updated : 06 Jan 2024 19:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫోన్‌ పోతేనే దొరకటం కష్టం. ఇక ఎయిర్‌పాడ్స్‌ పోతే ఆశ వదులుకోవాల్సిందే. కానీ ఓ వ్యక్తి అలా ఊర్కోలేదు. వాటిని ఎలాగైనా తిరిగి సంపాదించాలనుకున్నాడు. చివరకు అనుకున్నది సాధించాడు.

ముంబయికి చెందిన నిఖిల్ జైన్ విహార యాత్రకు కేరళ వెళ్లాడు. అక్కడే తన యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ పోగొట్టుకున్నాడు. అవి తనకెంతో ఇష్టమైనవి. ఖరీదైనవి కూడా! వాటిని తిరిగి చేజిక్కించుకోవాలని అనుకున్నాడు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టాడు. ‘‘ఓ జాతీయ పార్కు చూడ్డానికి వెళ్లినప్పుడు బస్సులో ఎయిర్‌పాడ్స్‌ పోగొట్టుకున్నా. సిగ్నల్స్‌ లేకపోవటంతో ట్రాక్‌ చేయలేకపోయా. వేరే ప్రాంతానికి వచ్చి ట్రాక్‌ చేయగా.. నేనున్న ప్రదేశానికి అవి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించా. ఎవరో వాటిని తీసుకున్నారని అర్థమైంది. అక్కడ పోలీసులను ఆశ్రయించా. వారు కచ్చితమైన ప్రదేశాన్ని కనిపెట్టలేకపోయారు. మళ్లీ ట్రాకింగ్‌ మొదలుపెట్టా. రెండు రోజులుగా అవి దక్షిణ గోవాలో ఉన్నాయి. పాడ్స్‌ తీసుకున్న వ్యక్తి గోవా వాసి అయిండాలి. మీలో ఎవరైనా గోవాలో నివసిస్తున్నారా?నాకు సాయం చేయగలరా?’ అంటూ ఫాలోవర్లను అడిగాడు. ఆ చిరునామా, గూగుల్ స్ట్రీట్ మ్యాప్‌ని జత చేశాడు. 

యూపీఐ మోసాన్ని తిప్పికొట్టిందిలా.. మహిళ పోస్ట్‌ వైరల్‌

నిఖిల్‌ ట్వీట్‌కి తక్కువ సమయంలోనే మిలియన్ల వీక్షణలు వచ్చాయి. వందల కామెంట్లతో వైరల్‌ అయింది. ‘మా బంధువులకి వివరాలు పంపా. మార్మగోవా పోలీస్‌ స్టేషన్‌లో మీ పాడ్స్‌ అందిస్తారు. వచ్చి కలెక్ట్‌ చేసుకోవచ్చు’ అంటూ ఓ యూజర్‌ సమాధానమిచ్చాడు. నిఖిల్‌ సంతోషానికి అవధుల్లేవు. గోవా వెళ్తున్న తన స్నేహితుడి సాయంతో వాటిని తెప్పించుకుని, ఆ విషయాన్ని జనవరి 5న ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు