Crime: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్‌ అన్న కుమారుడిపై మరో కేసు

మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్‌ అన్న కుమారుడు కన్నారావు సహా ఐదుగురిపై బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

Updated : 18 Apr 2024 17:08 IST

హైదరాబాద్‌: మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్‌ అన్న కుమారుడు కన్నారావుపై మరో కేసు నమోదైంది. ఆయనతో పాటు ఐదుగురిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. తనను బెదిరించి డబ్బు తీసుకున్నట్లు ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వారిపై ఫిర్యాదు చేశాడు. గెస్ట్‌హౌస్‌లో నిర్బంధించి దాడి చేశారని అందులో పేర్కొన్నాడు.

ఓ సమస్య పరిష్కారం కోసం కన్నారావు వద్దకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి విజయవర్ధన్ రావు వెళ్లారు. కన్నారావుకు పరిచయస్తురాలైన నందిని.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వద్ద నగలు, నగదు ఉన్నాయన్న విషయం ఆయనకు తెలిపింది. సదరు మహిళతో పాటు మరికొంత మందితో కలిసి ఆయన విజయవర్ధన్‌ రావును గెస్ట్‌ హౌస్‌లో నిర్బంధించాడు. అతడిని బెదిరించి రూ.60 లక్షల నగదు, 97 తులాల బంగారం దోచుకున్నాడు. తనకు పోలీసు అధికారి భుజంగరావు, ఏసీపీ కట్టా సాంబయ్య తెలుసంటూ కన్నారావు బెదిరించాడని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మన్నెగూడ భూవివాదంలో ఇప్పటికే కన్నారావుపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని