Viveka Murder Case: వివేకా హత్య కేసు.. ఆధారాలు చెరిపివేసేందుకు ఉదయ్‌ యత్నించాడు : సీబీఐ

వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి అనుచరుడు ఉదయ్‌ రిమాండ్‌ రిపోర్టులో సీబీఐ పలు కీలక అంశాలను పొందుపరిచింది.

Updated : 15 Apr 2023 13:21 IST

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆధారాలు చెరిపివేసేందుకు కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి అనుచరుడు ఉదయ్‌కుమార్‌ రెడ్డి ప్రయత్నించాడని సీబీఐ వెల్లడించింది. ఉదయ్‌ రిమాండ్‌ రిపోర్టులో పలు కీలక అంశాలను సీబీఐ పొందుపరిచింది.

‘‘వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు చిత్రీకరణకు యత్నించారు. ఆధారాలు చెరిపివేసేందుకు ఉదయ్‌ ప్రయత్నించాడు. హత్య జరిగిన రోజు ఉదయం 4 గంటలకు ఉదయ్‌ తన ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. ఆ రోజంతా ఎంపీ అవినాష్‌ ఇంట్లోనే ఉదయ్‌, శివశంకర్‌రెడ్డి ఉన్నారు. హత్య జరిగిందని తెలిసిన వెంటనే ఆధారాల చెరిపివేతకు వారిద్దరూ అవినాష్‌ ఇంట్లోనే ఎదురుచూశారు. అవినాష్‌కు శివప్రకాశ్‌రెడ్డి ఫోన్‌ చేసి వివేకా చనిపోయినట్లు సమాచారమిచ్చాడు. హత్య జరిగిన స్థలంలో అవినాష్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌ రెడ్డి, గంగిరెడ్డి, శివశంకర్‌ రెడ్డితో కలిసి ఉదయ్‌ ఆధారాలు చెరిపివేశారనేందుకు సాక్ష్యాలున్నాయి. ఆ రోజు అవినాష్‌ ఇంట్లోనే ఉదయ్‌, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి ఉన్నట్లు గూగుల్‌ టేక్‌అవుట్‌ ద్వారా గుర్తించాం. వారు అవినాష్ ఇంటి నుంచి వివేకా ఇంటికి వెళ్లినట్లు గుర్తించాం. విచారణకు ఉదయ్‌ సహకరించడం లేదు. పారిపోతాడనే ఉద్దేశంతోనే ముందస్తుగా అరెస్టు చేశాం. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది ’’ అని సీబీఐ పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని