Bengaluru rave party: రేవ్‌ పార్టీ కేసులో కదులుతున్న డొంక.. ఏపీ మంత్రి కాకాణి అనుచరుడి అరెస్టు

బెంగళూరు రేవ్‌పార్టీ కేసు దర్యాప్తును నగర నేర నియంత్రణ దళం (సీసీబీ) వేగవంతం చేసింది. ప్రధాన నిందితుడు వాసుతో పాటు మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Updated : 26 May 2024 11:49 IST

నటి హేమ సహా 8 మందికి  విచారణ నోటీసులు

బెంగళూరు, న్యూస్‌టుడే: బెంగళూరు రేవ్‌పార్టీ కేసు దర్యాప్తును నగర నేర నియంత్రణ దళం (సీసీబీ) వేగవంతం చేసింది. ప్రధాన నిందితుడు వాసుతో పాటు మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణను ఎదుర్కొంటున్న వారిలో ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అన్నమయ్య జిల్లా రాయచోటి వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిల అనుచరులు కొందరు ఉన్న విషయం తెలిసిందే. ఆ పార్టీలో మంత్రి కాకాణి పేరు ఉన్న కారు స్టిక్కర్‌ను సీసీబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని ఆధారంగా హైదరాబాద్‌కు చెందిన పూర్ణారెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. రేవ్‌పార్టీ ఏర్పాటులో ఆయన ప్రముఖపాత్ర పోషించారని, ఆయన మంత్రి అనుచరుడేనని పోలీసులు ధ్రువీకరించారు. ఇప్పటికే అరెస్టు అయిన ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అనుచరుడు అరుణ్‌కుమార్‌ సెల్‌ఫోన్‌ ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నామని వెల్లడించారు. ఈ పార్టీలో పాల్గొన్న తెలుగు సినీ నటి హేమ సహా మొత్తం ఎనిమిది మందికి సీసీబీ పోలీసులు శనివారం నోటీసులు జారీచేశారు. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. మొత్తం 86 మంది డ్రగ్స్‌ తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో బయటపడగా.. అందులో 59 మంది పురుషులు, 27 మంది యువతులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు