Hyderabad: సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు 14 రోజుల రిమాండ్‌

హైదరాబాద్‌ సీసీఎస్‌ ఏసీపీ టి.ఎస్‌.ఉమామహేశ్వరరావుకు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. 

Published : 22 May 2024 16:54 IST

హైదరాబాద్‌: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్‌ సీసీఎస్‌ ఏసీపీ టి.ఎస్‌.ఉమామహేశ్వరరావును అరెస్టు చేసిన అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు బుధవారం కోర్టులో హాజరుపర్చారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో ఉమామహేశ్వరరావును చంచల్‌గూడ జైలుకు తరలించారు. 

మంగళవారం తెల్లవారుజామునే హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లోని ఏసీపీ ఇంటికి చేరుకున్న ఏసీబీ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని 14 చోట్ల ఏకకాలంలో మరిన్ని బృందాలు సోదాలు జరిపాయి. ఉమామహేశ్వరరావు సోదరుడితోపాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ ఇవి కొనసాగాయి. సోదాల్లో భారీగా రూ.500 నోట్ల కట్టలను, ఆభరణాలను, 17 ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తుల పత్రాలను గుర్తించారు. ఇప్పటివరకు విశ్లేషించిన సమాచారం మేరకు ఆదాయానికి మించిన ఆస్తుల విలువ రూ.3.46 కోట్ల వరకు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రెట్టింపు ఉంటుందని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని