Crime news : బైక్‌పై లిఫ్ట్‌ ఇస్తామని చెప్పి.. విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

ఉత్తరప్రదేశ్‌లో (Uttar pradesh) దారుణం చోటు చేసుకుంది. లిఫ్ట్‌ ఇస్తామని నమ్మబలికి ఓ బాలికపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.

Published : 13 Sep 2023 02:25 IST

లఖ్‌నవూ: కళాశాల నుంచి ఇంటికి వెళ్తున్న ఓ విద్యార్థినికి లిఫ్ట్‌ ఇస్తామని చెప్పి ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ఆ దురాగతాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar pradesh)  ఓ గ్రామానికి చెందిన బాలిక ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది. సోమవారం మధ్యాహ్నం ఆమె కళాశాల నుంచి ఇంటికి వెళ్తుండగా ఇద్దరు తెలిసిన వ్యక్తులు బైక్‌పై వచ్చి ఆమె దగ్గర ఆపారు. ఇంటి దగ్గర దిగబెడతామని చెప్పి బాలికను బైక్‌పై ఎక్కించుకున్నారు.

హెల్మెట్‌లు ధరించి ఏటీఎం వద్ద తచ్చాడుతూ.. గార్డును చంపి..

ఆ తరువాత ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. అక్కడికి మరో ముగ్గురు వ్యక్తులు చేరుకున్నారు. ఆ ఐదుగురూ కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని ఓ కూడలి వద్ద వదిలిపెట్టారు. ఆమె నేరుగా పోలీసులను ఆశ్రయించడంతో వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. వారిపై పోక్సో సహా పలు కేసులు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం మీరట్ ఆస్పత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని