Mahabubnagar: వివాహేతర సంబంధం.. సీఐపై కానిస్టేబుల్‌ హత్యాయత్నం

మహబూబ్‌నగర్‌ సీసీఎస్‌ సీఐ ఇఫ్తికార్‌ అహ్మద్‌పై హత్యాయత్నం జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. బుధవారం అర్ధరాత్రి ఈ దాడి జరిగింది.

Updated : 02 Nov 2023 19:59 IST

మహబూబ్‌నగర్‌ నేరవిభాగం: మహబూబ్‌నగర్‌ సీసీఎస్‌ సీఐ ఇఫ్తికార్‌ అహ్మద్‌పై హత్యాయత్నం జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. బుధవారం అర్ధరాత్రి ఈ దాడి జరిగింది. స్థానికంగా ఓ పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌.. సీఐపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

సీఐ మర్మాంగాలను కోయడంతో పాటు ఆయన తలపై బలమైన ఆయుధాలతో నిందితుడు దాడి చేశాడు. దీంతో సీఐను తొలుత జిల్లా కేంద్రంలోని ఎస్‌ఈఎస్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సీఐ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిందితుడి భార్య కూడా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆమె మహబూబ్‌నగర్‌లోనే ఓ పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నారు.  

ఈ ఘటనపై సమాచారం అందుకున్న జోగులాంబ జోన్‌ డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌, ఎస్పీ హర్షవర్ధన్‌, అదనపు ఎస్పీ రాములు తదితరులు జిల్లా కేంద్రంలోని ఎస్‌ఈఎస్‌ ఆస్పత్రికి వచ్చి సీఐను పరామర్శించారు. హత్యాయత్నం జరిగేందుకు గల కారణాలపై మహబూబ్‌నగర్‌ రూరల్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో పూర్తి వివరాలు వెల్లడవుతాయని పోలీసులు చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని