Crime News: తమ్ముడిని గొడ్డలితో నరికి చంపిన అన్న

అనంతపురం జిల్లా శెట్టూరు మండలం కనకూరులో తమ్ముడిని అన్న గొడ్డలితో నరికి చంపాడు. అన్నదమ్ములు రవికుమార్‌, కృష్ణమూర్తి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు.

Updated : 08 Dec 2023 11:15 IST

శెట్టూరు: అనంతపురం జిల్లా శెట్టూరు మండలం కనకూరులో తమ్ముడిని అన్న గొడ్డలితో నరికి చంపాడు. అన్నదమ్ములు రవికుమార్‌, కృష్ణమూర్తి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు. ఈక్రమంలోనే బుధవారం సెల్‌ఫోన్‌ విషయంలో పరస్పరం కొట్టుకున్నారని చెప్పారు. ఈ ఘటనతో ఆగ్రహించిన అన్న రవికుమార్‌ గురువారం రాత్రి కృష్ణమూర్తి నిద్రిస్తుండగా గొడ్డలితో నరికినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం సెట్టూరు పోలీస్‌ స్టేషన్‌లో నిందితుడు రవికుమార్‌ లొంగిపోయాడని.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని