Suicide: లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు.. ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య

లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి మృతదేహం గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద కృష్ణా నదిలో లభ్యమైంది. 

Published : 27 May 2024 14:38 IST

తాడేపల్లి: లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి మృతదేహం గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద కృష్ణా నదిలో లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన మురికింటి వంశీ (22) ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇంట్లో తెలియకుండా లోన్‌ యాప్‌లో రూ.10వేల రుణ తీసుకున్నాడు. అయితే యాప్‌ నిర్వాహకులు రూ.లక్ష కట్టాలంటూ వంశీని వేధించారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పేందుకు భయపడిన విద్యార్థి.. ఈనెల 25న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తాను చనిపోతున్నానంటూ కుటుంసభ్యులకు మెసేజ్‌ పెట్టాడు. ఆ తర్వాత నుంచి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చింది. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు రెండు రోజులుగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో తాడేపల్లిలో కృష్ణా నది వద్ద మొబైల్‌ ఫోన్‌, చెప్పులు, బైక్‌ కనిపించాయి. నదిలో గాలింపు చేపట్టగా వంశీ మృతదేహాన్ని గుర్తించారు. తండ్రి పిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని