Fire Accident: పెద్దపల్లిలో అగ్నిప్రమాదం.. రెండు దుకాణాలు దగ్ధం

జిల్లా కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Updated : 08 Mar 2024 07:41 IST

పెద్దపల్లి: జిల్లా కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో జెండా కూడలిలోని ఒక వాణిజ్య సముదాయంలో మొబైల్ షాప్, పూజా సామగ్రి దుకాణం పూర్తిగా దగ్ధమయ్యాయి. వాచ్ షాప్‌, మరో రెండు దుకాణాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. విద్యుదాఘాతంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. పెద్దపల్లిలోని అగ్నిమాపక శకటం వచ్చి సుమారు 3 గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేసింది. సుమారు రూ.60 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని సీఐ కృష్ణ, ఎస్సై లక్ష్మణ్ రావు తదితరులు పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని