Fire Accident: పోలీసు శిక్షణాకేంద్రం యార్డులో అగ్నిప్రమాదం.. 300 వాహనాల దగ్ధం!

దిల్లీలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. వాజిరాబాద్‌ పోలీస్‌ శిక్షణా కేంద్రంలోని యార్డులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దాదాపు 300పైగా వాహనాలు కాలి బూడిదయ్యాయి.

Published : 30 May 2024 23:10 IST

దిల్లీ: దిల్లీలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. వాజిరాబాద్‌ పోలీస్‌ శిక్షణా కేంద్రంలోని యార్డులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దాదాపు 300పైగా వాహనాలు కాలి బూడిదయ్యాయి. వీటిలో 125 ఫోర్‌ వీలర్స్‌, 175 ద్విచక్ర వాహనాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగలేదని తెలిపారు. ‘‘గురువారం మధ్యాహ్నం మంటలు చెలరేగుతున్నట్లు మాకు సమాచారం అందింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేశాం. 14 అగ్నిమాపక శకటాలతో 40 మంది సిబ్బంది సంఘటన స్థిలికి చేరుకున్నారు. మంటలు ఆర్పే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది’’ అని దిల్లీ ఫైర్‌ సర్వీసెస్‌ డివిజనల్‌ అధికారి అశోక్‌కుమార్‌ వెల్లడించారు.

దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉంటే ఈ యార్డులో వివిధ సందర్భాల్లో సీజ్‌ చేసిన సుమారు 4 వేలకు పైగా వాహనాలను పార్క్‌ చేసినట్లు అశోక్‌కుమార్‌ చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా.. లేదా ఎవరైనా కావాలనే నిప్పుపెట్టారా?అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సీట్‌ కవర్లు, వాహనాలకు వేసిన పెయింట్స్‌ వల్ల మంటలు వేగంగా వ్యాపించాయని తెలిపారు. కచ్చితంగా ఎన్నివాహనాలు కాలిపోయాయన్నది త్వరలోనే తెలుస్తుందని, ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని