Crime news : యూపీ బృందావనంలో విషాదం.. బాల్కనీ కూలిపోవడంతో ఐదుగురు మృతి!

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) రాష్ట్రంలోని బృందావనంలో ఓ భవనం బాల్కనీ కూలిపోయింది. ఆ శిథిలాలు రద్దీ మార్గంపై పడటంతో ఐదుగురు మృతిచెందారు.

Published : 15 Aug 2023 22:36 IST

లఖ్‌నవూ : ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) బృందావనంలో విషాదం చోటు చేసుకుంది. ఓ భవనం బాల్కనీ కూలిపోవడంతో ఐదుగురు మృతిచెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. బృందావనంలోని బాంకే బిహారి ఆలయ వీధులు నిత్యం రద్దీగా ఉంటాయి. ఇక్కడ దుకాణాలు ఎక్కువగా ఉండటంతో భక్తులు నిరంతరం రాకపోకలు సాగిస్తుంటారు. మంగళవారం ఈ ప్రాంతంలోని ఓ భవనం బాల్కనీ ఒక్కసారిగా విరిగిపడింది. ఆ శిథిలాలు ఓ కారుపై, మరికొందరు మనుషులపై పడిపోయాయి. ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

దేవుడి కోసం ఆత్మ బలిదాన యత్నం.. చెట్లు నరికే యంత్రంతో తల కోసుకున్నాడు!

బాల్కనీ కూలిపోయిన వెంటనే భారీ శబ్దం వెలువడటంతో ఏం జరిగిందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. చుట్టుపక్కలి ప్రజలు బిగ్గరగా అరుస్తూ పరుగులు తీశారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అధికారులు ఆ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన క్షతగాత్రులను వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటనలో ఐదుగురు చనిపోయారని మథుర అదనపు చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ తెలిపారు. తీవ్రంగా గాయపడిన మరో 10 మందిని వివిధ ఆస్పత్రులకు తరలించినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని