Gang rape: భర్తను చావబాది.. భార్యపై సామూహిక అత్యాచారం

బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తల్ని ఐదుగురు దుండగులు అడ్డగించారు. భర్తను చావగొట్టి..అతడి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Published : 25 Oct 2023 01:59 IST

భువనేశ్వర్‌: ఒడిశాలోని (Odisha) డెంకానాల్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తల్ని ఐదుగురు దుండగులు అడ్డగించి దాడి చేశారు. భర్తను చావబాది, అతడి భార్యను సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అక్టోబరు 21న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కేసు వివరాలను పోలీసులు మంగళవారం మీడియాకు వెల్లడించారు.

జాజ్‌పుర్‌ జిల్లాకు చెందిన ఓ మహిళ చదువుకునేందుకు బారునా ప్రాంతంలో ఉంటున్నారు. ఆమెను తీసుకెళ్లేందుకు జాజ్‌పుర్‌ నుంచి భర్త వచ్చాడు. ఇద్దరూ కలిసి శనివారం సాయంత్రం బైక్‌పై వెళ్తుండగా.. ఓ వాగు సమీపంలో వారిని ఐదుగురు దుండగులు అడ్డగించారు. భర్తపై దాడి చేసి.. మొబైల్‌, బైక్‌ తాళాలు లాక్కున్నారు. అతడిని చావగొట్టి.. భార్యను సమీపంలోని అడవిలోకి ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు భూబన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు బాధితురాలిని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, అత్యాచారం రుజువైనట్లు తేలితే.. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని మీడియాకు వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో అత్యాచారం జరిగినట్లు  తేలిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని