Blast in factory: పరిశ్రమలో రియాక్టర్‌ పేలి ఏడుగురి మృతి.. 50 మందికి పైగా గాయాలు

రసాయన పరిశ్రమలో రియాక్టర్‌ పేలి ఏడుగురు మృతి చెందిన ఘటన ఠానేలో చోటుచేసుకుంది.

Updated : 23 May 2024 19:14 IST

ఠానే: మహారాష్ట్రలోని ఠానేలో ఓ రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. 56 మందికి గాయాలయ్యాయి. డోంబివిలి ఎంఐడీసీ ఫేజ్‌ -2 ప్రాంతంలోని అముదాన్‌ కెమికల్‌ కంపెనీలో ఈ మధ్యాహ్నం 1.40 గంటల సమయంలో రియాక్టర్‌ పేలడంతో ఈ విషాదం చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ఈ ఘటనలో ఏడు మృతదేహాలను గుర్తించగా.. ఇద్దరు మహిళలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పేలుడు కారణంగా పెద్దఎత్తున చెలరేగిన మంటల ప్రభావం ఆ ప్రాంతంలో కనీసం ఐదు కంపెనీలపై పడినట్లు తెలిపారు. ఈ పేలుడు ధాటికి దాదాపు కి.మీ. మేర శబ్దం వినిపించినట్లు ప్రత్యక్షసాక్షి చెప్పారు. పక్కనే ఉన్న భవనాల అద్దాలకు పగుళ్లు రాగా..  పరిసరాల్లోని పలు ఇళ్లు సైతం దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.

బెంగళూరు రేవ్‌ పార్టీ.. తెలుగు నటికి డ్రగ్‌ పాజిటివ్‌: పోలీసులు

ముంబయికి 40 కి.మీ.ల దూరంలో ఉన్న మహారాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్‌ (MIDC) ప్రాంతంలో ఈ ఘటన జరగ్గా..  పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్‌ సమంత్‌, ఎంపీ శ్రీకాంత్‌ శిందే, ఎమ్మెల్యే రాజు పాటిల్‌ అక్కడికి వెళ్లి పరిశీలించారు.  ఈ ఘటనపై సీఎం ఏక్‌నాథ్ శిందే స్పందించారని.. క్షతగాత్రులకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చినట్లు మంత్రి సమంత్‌ విలేకర్లకు వెల్లడించారు. బాధితులకు వారం రోజుల్లోగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు