Lasya Nanditha: లాస్య నందిత దవడ ఎముక విరిగింది: ‘గాంధీ’ వైద్యులు

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ భారాస ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) రోడ్డు ప్రమాదంలో మృతికి సంబంధించిన వివరాలను గాంధీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

Updated : 23 Feb 2024 14:58 IST

హైదరాబాద్: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ భారాస ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) రోడ్డు ప్రమాదంలో మృతికి సంబంధించిన వివరాలను గాంధీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయాలైనట్లు పోస్టుమార్టం పూర్తిచేసిన అనంతరం వైద్యులు మీడియాకు తెలిపారు. లాస్య నందిత దవడ ఎముక విరిగిందని.. ఎడమ కాలు ఎముక, ఛాతీ ఎముకలు సైతం విరిగాయని పేర్కొన్నారు. 

మరోవైపు, ఈ ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నందిత మృతిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామునే ప్రమాదం జరిగిందని.. డ్రైవర్‌ నిద్రమత్తు, వేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో ఆమె ప్రయాణించిన కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని