అప్పు చెల్లించలేదని.. భర్త కళ్లెదుటే భార్యపై అత్యాచారం

అప్పు తిరిగి చెల్లించలేదన్న కారణంతో ఓ మహిళను ఆమె భర్త కళ్లెదుటే అత్యాచారం చేసిన ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది.

Updated : 28 Jul 2023 09:47 IST

పుణె: అప్పు తిరిగి చెల్లించలేదన్న కారణంతో ఓ మహిళను ఆమె భర్త కళ్లెదుటే అత్యాచారం చేసిన ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది. ఫిబ్రవరిలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు గురువారం తెలిపిన వివరాల ప్రకారం బాధిత భార్యాభర్తలు నిందితుడు ఇంతియాజ్‌ షేక్‌ నుంచి కొంతకాలం క్రితం రుణం తీసుకున్నారు. దాన్ని తిరిగి చెల్లించలేకపోయారు. ఈక్రమంలో నిందితుడు మహిళ భర్తను కత్తితో బెదిరించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ అకృత్యాన్ని చిత్రీకరించి ఆ తర్వాతా పలుమార్లు బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె ఎదురు చెప్పడంతో ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశాడు. అతడి ఆగడాలను భరించలేని దంపతులు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకుని అతడిని అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు