బెంగళూరు పాఠశాలలకు బాంబు బెదిరింపు

బడి గంటలు మోగక ముందే.. శుక్రవారం ఉదయమే బెంగళూరులోని ప్రైవేటు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Published : 02 Dec 2023 02:53 IST

ముంబయి తరహా విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరిక

ఈనాడు, బెంగళూరు: బడి గంటలు మోగక ముందే.. శుక్రవారం ఉదయమే బెంగళూరులోని ప్రైవేటు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నగరంలోని దాదాపు 68 పాఠశాలలకు వచ్చిన మెయిల్‌లో ‘మీ పాఠశాల వద్ద పేలుడు సామగ్రి అమర్చాం. అవి ఏ క్షణంలోనైనా పేలవచ్చు. మతం మార్చుకోకపోతే మీ పిల్లల మృత్యువును ఆహ్వానించండి. దేవుడి మార్గంలో ముంబయి తరహా విధ్వంసాన్ని సృష్టించేందుకు వందల మంది సిద్ధంగా ఉన్నారు. మాకు లోబడి ఉండటమో- మా ఖడ్గానికి బలి కావడమో తప్ప మరో మార్గం లేదు’ అంటూ మొజాహిదీన్‌ పేరిట బీబల్‌.కామ్‌ ఐడీ నుంచి ఈ మెయిల్స్‌ పంపారు. ఉదయం 8 గంటలకే పాఠశాలల అధికారిక ఐడీలకు ఈ మెయిల్స్‌ రావడంతో ఉద్యోగులు స్పందించి పోలీసులకు, తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించారు. ప్రసార మాధ్యమాల్లో దీనిపై కథనాలు రావడంతో తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాఠశాలల వద్ద తమ పిల్లల కోసం బారులు తీరారు. మధ్యాహ్నం 12 గంటలకే అన్ని పాఠశాలల యాజమాన్యాలూ తమ విద్యార్థులను ఇళ్లకు పంపేశాయి. మరోవైపు నగర పోలీసులు బాంబు తనిఖీ బృందాలను పాఠశాలలకు పంపి ప్రాంగణాల్లో గాలింపు చేపట్టారు. ప్రాథమిక విచారణ ప్రకారం ఈ మెయిల్స్‌ అన్నీ వదంతులు సృష్టించే లక్ష్యంతోనే పంపినట్లు నగర కమిషనర్‌ బి.దయానంద్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని