ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఒకే కుటుంబానికి చెందిన 8 మంది రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఒడిశాలోని కేంఝర్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

Published : 02 Dec 2023 02:54 IST

ఒకే కుటుంబానికి చెందిన 8 మంది దుర్మరణం

కటక్‌, న్యూస్‌టుడే: ఒకే కుటుంబానికి చెందిన 8 మంది రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఒడిశాలోని కేంఝర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. గంజాం జిల్లా సన్నొఖెముండి సమితిలోని పుడామారి, బతాగడ, పాలొఝడి గ్రామాలకు చెందిన 20 మంది కుటుంబ సభ్యులు కేంఝర్‌ జిల్లాలోని ఘటగావ్‌ టౌన్‌లో తరిణి అమ్మవారు, పూరీలో జగన్నాథుడిని దర్శించుకునేందుకు గురువారం రాత్రి వింగర్‌ వాహనంలో బయల్దేరారు. శుక్రవారం వేకువజామున 20వ నంబరు జాతీయ రహదారిపై బలిజోడి గ్రామం వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రక్కు వెనక భాగాన్ని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో చిన్నారి చికిత్స పొందుతూ చనిపోయింది. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతున్న వారిలో కొంత మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సీఎం నవీన్‌ పట్నాయక్‌ మృతులకు రూ.3 లక్షల చొప్పున నష్టపరిహారం అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని