భార్యాబిడ్డలను చంపి రైల్వే వైద్యుడి ఆత్మహత్య!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చెందిన ఓ వైద్యుడు తన భార్యాపిల్లలను చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.

Updated : 07 Dec 2023 05:17 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చెందిన ఓ వైద్యుడు తన భార్యాపిల్లలను చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. మిర్జాపుర్‌కు చెందిన అరుణ్‌కుమార్‌ సింగ్‌ (45) గత నాలుగేళ్లుగా మోడరన్‌ రైల్వే ఆస్పత్రిలో కంటి వైద్యుడిగా పనిచేస్తున్నాడు. అరుణ్‌ తన భార్య అర్చన (40), కుమార్తె అరిబా (12), కుమారుడు ఆరవ్‌ (4)లతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అరుణ్‌కుమార్‌ తన భార్య, ఇద్దరు పిల్లలను దారుణంగా తలలు పగులగొట్టి చంపేసి.. తాను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అరుణ్‌సింగ్‌ మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. అరుణ్‌, అర్చనలది ప్రేమవివాహం కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని