సుఖ్‌దేవ్‌సింగ్‌ హత్యకేసు నిందితుల్లో సైనికుడు!

రాష్ట్రీయ రాజ్‌పూత్‌ కర్ణిసేన చీఫ్‌ సుఖ్‌దేవ్‌సింగ్‌ గోగామేడీ హత్య రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. జైపుర్‌లో జరిగిన ఈ హత్యను నిరసిస్తూ కర్ణిసేన బుధవారం రాజస్థాన్‌ బంద్‌ నిర్వహించింది.

Published : 07 Dec 2023 05:10 IST

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఆందోళనలు

జైపుర్‌, భోపాల్‌: రాష్ట్రీయ రాజ్‌పూత్‌ కర్ణిసేన చీఫ్‌ సుఖ్‌దేవ్‌సింగ్‌ గోగామేడీ హత్య రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. జైపుర్‌లో జరిగిన ఈ హత్యను నిరసిస్తూ కర్ణిసేన బుధవారం రాజస్థాన్‌ బంద్‌ నిర్వహించింది. హంతకులను అరెస్టు చేయాలని కోరుతూ పలు జిల్లాలో సుఖ్‌దేవ్‌సింగ్‌ మద్దతుదారులు ఆందోళనలు చేపట్టారు. హింసాత్మక ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు మధ్యప్రదేశ్‌లోనూ భోపాల్‌, ఇందౌర్‌, జబల్‌పుర్‌ తదితర నగరాల్లో ఆందోళనలు జరిగాయి. ఈ రాష్ట్రంలోని రాజ్‌పూత్‌ వర్గ సంస్థలు గురువారం రాష్ట్ర బందుకు పిలుపునిచ్చాయి. మరోవైపు.. సుఖ్‌దేవ్‌సింగ్‌పై కాల్పులు జరిపిన ఇద్దరిని పోలీసులు గుర్తించారు. హరియాణాకు చెందిన నితిన్‌ ఫౌజీ, రాజస్థాన్‌ వాసి రోహిత్‌ రాఠోడ్‌ ఈ హత్యలో పాల్గొన్నట్లు గుర్తించి, వారి ఫొటోలను పొరుగు రాష్ట్రాల పోలీసులకు సైతం పంపించారు. ఇందులో నితిన్‌ ఫౌజీ సైనికుడు. ఆయన స్వస్థలం హరియాణాలోని దౌంగడా. నాలుగేళ్ల క్రితం ఆర్మీలో చేరిన నితిన్‌ గత నవంబరులో సెలవుపై వచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని