తండ్రి దెబ్బలకు మూడేళ్ల కుమారుడి బలి

 తండ్రి దెబ్బలకు మూడేళ్ల పసివాడు బలయ్యాడు. విషాదకరమైన ఈ సంఘటన మహేశ్వరం పరిధిలోని అమీర్‌పేటలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.

Updated : 08 Dec 2023 06:50 IST

మహేశ్వరం, మంత్రాలయం, న్యూస్‌టుడే:  తండ్రి దెబ్బలకు మూడేళ్ల పసివాడు బలయ్యాడు. విషాదకరమైన ఈ సంఘటన మహేశ్వరం పరిధిలోని అమీర్‌పేటలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.  పోలీసుల వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బూదూరు గ్రామానికి చెందిన లలితమ్మకు సి.బెళగల్‌ మండలం రంగాపురం గ్రామానికి చెందిన శివతో వివాహమైంది. బతుకుదెరువు కోసం వారు మహేశ్వరం పరిధిలోని అమీర్‌పేటకు వలస వచ్చారు. నాలుగేళ్ల ప్రణయ్‌, మూడేళ్ల సంజు, 6 నెలల పాప వారి సంతానం. శివ మేస్త్రీ పనిచేస్తాడు. అతను పని మీద బయటకు వెళ్లగా.. సంజు ఇంట్లో నిద్రపోయాడు. లలితమ్మ.. తన ఆరునెలల పాపను, ప్రణయ్‌ను వెంట తీసుకొని కూరగాయలు కొనేందుకు మార్కెట్కు వెళ్లింది. కొంతసేపటికి శివ ఇంటికి వచ్చి తలుపు తీయగా సంజు నిద్రలేచి నడుచుకుంటూ రోడ్డు ఎక్కాడు. బుజ్జగించినా.. వినకపోవడంతో ఇంట్లోకి లాక్కొచ్చి కొట్టాడు. తర్వాత కుటుంబ సభ్యులు సంజు(3)ను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. భార్యపై అనుమానంతో తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని లలితమ్మ కుంటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని