Crime News : ప్రియుడి మోజులో భర్తకు దూరం

ఓ వివాహిత ప్రియుడి మోజులో భర్తకు దూరమైంది. తీరా ప్రియుడి కుటుంబ సభ్యులు ఇంట్లోకి రానీయకపోవడంతో ఆత్మహత్యకు యత్నించింది.

Updated : 15 Dec 2023 08:15 IST

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: ఖరగ్‌పూర్‌ గ్రామీణంలో కుసుమద గ్రామానికి చెందిన వివాహిత ప్రియుడి మోజులో భర్తకు దూరమైంది. తీరా ప్రియుడి కుటుంబ సభ్యులు ఇంట్లోకి రానీయకపోవడంతో ఆత్మహత్యకు యత్నించగా గ్రామస్థులు కాపాడారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు యువతికి ఓ యువకుడితో వివాహం జరిగింది. పెళ్లయినా జగన్నాథ్‌ పూర్‌ గ్రామానికి చెందిన ప్రియుడితో రహస్యంగా గడిపేది. కొద్ది రోజులకు ఇది తెలుసుకున్న భర్త హెచ్చరించాడు. బుధవారం సాయంత్రం ఇదే విషయమై గొడవ జరిగింది. దీంతో ఆమె భర్తను విడిచి ప్రియుడి ఇంటికి వెళ్లిపోయింది. అతడి కుటుంబ సభ్యులు ఈమెను ఇంటిలోకి అనుమతించకపోవడంతో షాక్‌కు గురైంది. సమీపంలోని నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని పరుగులు తీసింది. గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అందరినీ పిలిచి కౌన్సెలింగ్‌ ఇస్తామని పోలీసులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని