ఏయూలో గంజాయితో పట్టుబడిన విద్యార్థులు

విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ వసతి గృహంలో ఏడుగురు విద్యార్థులు గంజాయితో పట్టుబడ్డారు.

Published : 23 Feb 2024 05:19 IST

విశాఖపట్నం ఏయూ ప్రాంగణం, పెదవాల్తేరు, న్యూస్‌టుడే: విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ వసతి గృహంలో ఏడుగురు విద్యార్థులు గంజాయితో పట్టుబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి వసతి గృహంలో విద్యార్థులు గంజాయి తాగుతున్నట్లు సమాచారం అందడంతో సెక్యూరిటీ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఏడుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారి గదిని తనిఖీ చేయగా గంజాయి సిగరెట్‌ పీకలు, 5 గ్రాముల గంజాయి దొరికినట్లు సీఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు