బాలికపై అత్యాచారం.. 80 ఏళ్ల వృద్ధుడికి 45 ఏళ్ల జైలు

బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో 80 ఏళ్ల వృద్ధుడికి కేరళ కోర్టు వివిధ సెక్షన్ల కింద మొత్తం 45 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Updated : 23 Feb 2024 07:03 IST

తిరువనంతపురం: బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో 80 ఏళ్ల వృద్ధుడికి కేరళ కోర్టు వివిధ సెక్షన్ల కింద మొత్తం 45 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఏకకాలంలో వాటిని అనుభవించాలని తీర్పునివ్వడంతో అతడు గరిష్ఠంగా 20 ఏళ్లు జైల్లో గడపాల్సి ఉంటుంది. తండ్రి మరణించడం, తల్లి విడిచిపెట్టి వెళ్లిపోవడంతో ఓ బాలిక (14) తన బంధువుల ఇంట్లో ఆశ్రయం పొందింది. వారి నివాసానికి సమీపంలోనే ఓ వృద్ధుడు దుకాణం నిర్వహించేవాడు. ఎవరూ లేని సమయంలో బాలిక ఇంట్లోకి చొరబడి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 2021కు సంబంధించిన ఈ కేసులో ఇడుక్కి ఫాస్ట్‌ట్రాక్‌ స్పెషల్‌ కోర్టు తాజాగా శిక్ష విధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు