ఐసీయూలోని మహిళపై అత్యాచారం

రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న మహిళ(24)పై అత్యాచారానికి పాల్పడ్డాడు నర్సింగ్‌ అసిస్టెంట్‌.

Published : 28 Feb 2024 05:00 IST

రాజస్థాన్‌లో ఘటన

జైపుర్‌: రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న మహిళ(24)పై అత్యాచారానికి పాల్పడ్డాడు నర్సింగ్‌ అసిస్టెంట్‌. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న మహిళకు మత్తుమందును అందించి నిందితుడు అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని చిరాగ్‌ యాదవ్‌గా గుర్తించారు. ఐసీయూలోని బాధితురాలి పడక దగ్గరకు నిందితుడు వెళ్లడం.. ఆ తర్వాత కర్టెన్లను మూసివేయడం సీసీటీవీ కెమెరాల్లో కనిపించినట్లు పోలీసులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని