మద్యానికి రూ.70 ఇవ్వలేదని కత్తిపోట్లు

మద్యం తాగేందుకు రూ.70 ఇవ్వలేదనే కారణంతో అందరూ చూస్తుండగానే స్నేహితుడిని కత్తితో పొడిచిన సంఘటన విజయవాడలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.

Published : 28 Mar 2024 04:19 IST

విజయవాడలో ఘటన

విజయవాడ (సూర్యారావుపేట), న్యూస్‌టుడే: మద్యం తాగేందుకు రూ.70 ఇవ్వలేదనే కారణంతో అందరూ చూస్తుండగానే స్నేహితుడిని కత్తితో పొడిచిన సంఘటన విజయవాడలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పాశవికంగా దాడి చేశాక నిందితుడు అక్కడే వికటాట్టహాసం చేస్తూ ప్రజలను భయభ్రాంతులను చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. భానునగర్‌కు చెందిన పప్పుల వంశీ, జోగు దుర్గారావు స్నేహితులు. ఇద్దరూ కూలి పనులు చేస్తుంటారు. రోజూ రాత్రి భానునగర్‌ కూడలిలోని బార్‌ వద్దకు మద్యం తాగేందుకు వస్తారు. మంగళవారం రాత్రి కూడా వచ్చి మద్యం తాగిన వంశీ.. ఇంకా తాగేందుకు రూ.70 కావాలని దుర్గారావును అడిగాడు. ఈ విషయంలో వాగ్వాదమేర్పడి మద్యం మత్తులో ఉన్న వంశీ ఆగ్రహంతో బీరు సీసాతో దుర్గారావుపై విచక్షణారహితంగా దాడి చేశాడు. బ్లూకోల్ట్స్‌ సిబ్బంది వచ్చి వంశీని నిలువరించి ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలైన దుర్గారావుకు ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని